అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ‘సామ్‌జామ్’ పేరుతో ‘ఆహా’ ఓటీటీలో రానున్న ఈ టాక్‌షోకు సామ్ ప్రయోక్తగా వ్యవహరింస్తోంది. తాజాగా సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్2’. ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా సమంత ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటేసింది. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. “ఇప్పుడే షూటింగ్ పూర్తి చేశాను. నాకో సర్‌ఫ్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్‌ను పొందాను. నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు” అంటూ సమంత పేర్కొంది.
previous post
next post