telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో డ్రగ్… మాధవీలత వ్యాఖ్యలపై ఎక్సైజ్ పోలీసుల రియాక్షన్

Madhavilatha

టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. “తెలంగాణ NCB సార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. మన ఇండస్ట్రీలో డ్రగ్స్ బాగా వాడుకలో ఉన్నాయి. అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు ఇక్కడ. 2009లో వచ్చారు పొలిటికల్ అండతో వెనక్కి పోయారు. చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో… సినిమా వాళ్ళు, పబ్స్, స్టూడెంట్స్ బాగా వాడుతూ మాదక ద్యవ్యాల వారికీ బాగా ఆదాయాన్ని పెంచుతున్నారు” అంటూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలన్నారు. డ్రగ్స్ ను కంట్రోల్ చేశామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశామని, మరికొంత మందిపై నిఘా ఉందన్నారు ఎక్సైజ్ పోలీసులు. మరి మాధవీలత ఆధారాల విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts