telugu navyamedia
సినిమా వార్తలు

ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్

Sangeetha

ఒకప్పుడు టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నటి సంగీత. ఆమె నటించిన “ఖడ్గం” సినిమాలో సంగీత చెప్పిన “ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్” డైలాగ్ ను ఎప్పటికీ మరచిపోలేము. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహించే “అలీతో సరదాగా” షోకి వచ్చిన సంగీత తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలో భాగంగా అలీ “ఖడ్గం” సినిమాలో “ఒక్క ఛాన్స్” డైలాగ్ ఉంది కదా.. అలా రియల్ లైఫ్ లో ఎవరినైనా అడిగావా..?” అంటూ ప్రశ్నించగా… సంగీత మాట్లాడుతూ ”నిజంగా నా పరిస్థితి కూడా ఆ ఒక్క చాన్స్ ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ”ఇదంతా మన సినిమా ఇండస్ట్రీలో ఉంది.. నిజంగా ఇలా కూడా జరుగుతుంది. మన పరిస్థితి కూడా ఇదే కదా అని కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అన్పిస్తుంది” అంటూ పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసింది.

Related posts