telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ” ఫస్ట్ షో”

First-Show

K.K.R సినీ ఎంటర్ టైనర్ బ్యానర్ పై కిరణ్ కుమార్ రఘుపతి నిర్మాత గా జగదీష్ కె.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” ఫస్ట్ షో ” ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటివలే పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ కుమార్ రఘుపతి మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్ లో నటించి బెస్ట్ యాక్టర్ గా “సైమా” అవార్డ్ అందుకున్న సూర్య భరత్ చంద్ర ఈ చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరో కి జోడిగా ప్రియా దేశపాగ్ హీరోయిన్ గా నటిస్తోందన్నారు. దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం లో సినిమా రంగంలో హీరోగా ఎదగాలనుకునే కుర్రాడు పడే కష్టాలు. ఈ సమయంలో తనకు ఎదురుపడ్డ అమ్మాయి తో ప్రేమ ఆపై సమస్యలు. ఈ క్రమంలో తను అనుకున్న కల నెరవేరిందా!! లేదా! అనేది కదాంశం తో అద్భుతమైన కధనం తో ప్రేక్షకులను మెప్పించే విధంగా తెరకెక్కి స్తూన్నారు. ఈ చిత్రం లో మూడు ఫైట్స్. నాలుగు పాటలు ఉన్నాయి . పాటలను అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాము.ఈ చిత్రం యొక్కతదుపరి షెడ్యూల్ విజయనగరం. అరకు లలో షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తి చేస్తామని.. తెలిపారు.

Related posts