telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది ఐపీఎల్ లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ అందుకున్న ఆటగాళ్లు వీరే…

ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అయితే ప్రతి సీజన్ చివరిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అలాగే అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ అందజేస్తారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2020 లో 14 మ్యాచ్ లు ఆడిన రాహుల్ మొత్తం 670 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక అత్యధిక వికెట్లు సాధించి ఐపీఎల్ 2020 లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబడా. ఈ ఏడాది ఐపీఎల్ లో 17 మ్యాచ్ లు ఆడిన రబడా మొత్తం 30 వికెట్లు సాధించాడు. అందులో 4 వికెట్లు సాధించి 24 పరుగులు ఇవ్వడం రబడా మెరుగైన ప్రదర్శన. అలాగే ఈ ఐపీఎల్ లో ఎమర్జింగ్ ప్లేయర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బాట్స్మెన్ దేవదత్ పడికల్ నిలిచాడు. ఈ ఏడాదే ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన పడికల్ 5 అర్ధశతకాలతో 473 పరుగులు సాధించాడు. అయితే బెంగుళూరు జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా దేవదత్ పడికలే కావడం విశేషం.

Related posts