telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవన్నీ రూమర్సే అంటున్న నాని

Nani

నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మలు నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. మళ్లీ సాధారణ పరిస్థితులు రాగానే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నాని ఒక వింత డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తలపై నాని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా పై వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసాడు నాని.

Related posts