తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశాడు. ఎలాంటి సినిమానైనా తనదైన శైలిలో నటించి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పడు హీరో విజయ్ తమిళంలో పెద్ద స్టార్ హీరో అయ్యాడు. తమిళంలోనే కాదు… తెలుగులోనూ విజయ్ మంచి పేరు సాధించుకున్నాడు. అయితే… విజయ్ కెరీర్ ఆరంభమై నేటికి 28 ఏళ్లు అయింది. మొదటి నుంచి ఎక్కడా… వెనక్కి తగ్గకుండా తన కెరీర్‌ను మంచి స్థాయికి తెచ్చుకున్నాడు విజయ్. విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ సినిమా నేపథ్యగాయని, కర్ణాటక సంగీత విధ్వంసులు. “విజయ్” భారతీయ సినిమా నటుడు, నేపథ్యగాయకుడు. ఆయన ప్రాథమికంగ తమిళ చిత్రసీమలో ప్రవేశించాడు. విజయ్ మీడియా ద్వారా “తలపథి” (కమండర్) గా గుర్తింపబడ్డాడు. విజయ్ చెన్నైలో జన్మిచాడు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో “వెట్రి” (1984) నుండి ఇతు ఎంగల్ నీతి (1988) వరకు నటించాడు. తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని “నాలయ తీర్పు” (1992) లో నటునిగా ప్రవేశించాడు కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన “పూవె ఉనక్కాగ”. ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటునిగా నటించాడు. విజయ్ లేటెస్ట్ చిత్రం “మాస్టర్”తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడి టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా, మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
previous post
next post