telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడేళ్ళుగా విడుదలకు నోచుకోని త్రిష చిత్రం ఓటిటిలో…!

Trisha

చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం త్రిష తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ తమిళ్ లో సత్తా చాటుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ “96” సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో “కుట్రపయిరిచి” అనే తమిళ చిత్రం సెట్స్ పైకి వెళుతోంది. అయితే గత రెండు దశాబ్దాలుగా కథానాయికగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న త్రిష కెరీర్ ముఖ్యంగా తమిళంలో ఏమాత్రం సడలలేదు. కాగా మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి త్రిష చేసిన చిత్రం ‘శతురంగ వెట్టయ్ -2’. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts