telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

నేడు సినీ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి..?

Dilraju

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకుంటునట్టు  గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

అలాగే, తన వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదని పేర్కొన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన దిల్ రాజు, ఈ తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.

నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవాళ రాత్రి రెండో వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. తన కుటుంబసభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్టు సమాచారం.

Related posts