తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో… ప్రజల పై అన్ని పార్టీలు వరాల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు మలుచుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తాజాగా డిఎంకే పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాము అధికారం లోకి వస్తే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.1000 ఇస్తామని డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ నెల 11 న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు డిఎంకే పార్టీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీ.. అధికారంలోకి రానున్నట్లు అన్ని సర్వేలు చెబుతున్నాయి. అటు తమిళనాడు లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
previous post
next post