telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ వ్యాక్సిన్ ను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం…

corona vacccine covid-19

కరోనా ప్రపంచాన్ని ఏడాదికి పైగా అతలాకుతలం చేసింది. అయితే ఈ మధ్యే ఈ వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ఆస్ట్రియా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ మహిళ చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వేయాడాన్ని దేశవ్యాప్తంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రియా ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆస్ట్రియా ప్రావిన్స్‌లోని జ్వెట్ల్ జిల్లా క్లినిక్‌లోని ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, ఫెడరల్ ఆఫీస్ ఫర్ సేఫ్టీ ఇన్ హెల్త్ కేర్ కు రెండు నివేదికలు వచ్చాయి. తీవ్రంగా రక్తం గడ్డకట్టడం వల్ల 49 ఏళ్ల ఓ మహిళ మరణించగా, 35 ఏళ్ల మరో మహిళ పల్మనరీ ఎంబాలిజమ్‌ అభివృద్ధి జరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆ నివేదికలు వెల్లడించాయి. ఆ ఇద్దరు మహిళలు జ్వెట్ల్ క్లినిక్‌లో పనిచేస్తున్న నర్సులు అని స్థానిక మీడియా పేర్కొంది.. అయితే, వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ప్రభావాలలో రక్తం గడ్డకట్టడం లేదని బీఏఎస్‌జీ తెలిపింది. ఏదైనా సంభావ్య లింక్‌ను పూర్తిగా తోసిపుచ్చడానికి ఇది తన దర్యాప్తును తీవ్రంగా కొనసాగిస్తున్నది. చూడాలి మరి ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది.

Related posts