బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ముంబైలోని శాంతాక్రజ్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరూ దేవగన్‌కు ఇవాళ గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ డైరక్టర్‌గా వీరూ దేవగన్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తండ్రి ఆరోగ్యం లేకపోవడంతోనే అజయ్ దేవగన్ తన తాజా చిత్రం “దేదే ప్యార్ దే” సినిమా ప్రమోషన్‌కు హాజరుకాలేదు. 1983లో వచ్చిన “హిమ్మత్‌వాలా”, 1988లో వచ్చిన “షెహన్‌షా”, 1994లో వచ్చిన “దిల్‌వాలే” చిత్రాలకు వీరూదేవగన్ యాక్షన్ సన్నివేశాలను డైరక్ట్ చేశారు. 1980 దశకంలో వచ్చిన అనేక చిత్రాలకు యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు వీరూ దేవగన్ చేసేవారు. వీరూదేవగన్ పార్థివదేహానికి ఇవాళ సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ అజయ్ దేవగన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
previous post
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు