telugu navyamedia
సినిమా వార్తలు

బ్రేకప్ వార్తలపై స్పందించిన ఇలియానా

Ileana

గత కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ వార్తలపై ఇలియానా స్పందించింది. తన ప్రియుడితో విడిపోయిన సంగతి నిజమే అని సోషల్ మీడియాలో తెలిపింది. “మన జీవితంలో స్నేహితులు, సన్నిహితులు అందరిని కోల్పోక తప్పదు. కానీ మనల్ని మనం కోల్పోకూడదు. మన జీవితం నుంచి ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకు సాగాలి” అని ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన ప్రియుడితో విడిపోయినప్పటికీ తానేం బాధపడడం లేదని ఇలియానా చెప్పకనే చెబుతూ మతిపోగోట్టే భంగిమలో బికినిలో పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఇలియానా బికినీ పిక్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆ తరువాత ఇలియానా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టింది. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని వార్తలు విన్పిస్తున్నాయి. అంతేకాదు ఈ బ్యూటీ చిరంజీవి సరసన కథానాయికగా నటించబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

Waiting for the sun to come out ☀️ • • • 📸 @colstonjulian 💥

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

Related posts