telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ప్రముఖ దర్శకుడి బాగోతం త్వరలో బయటపెడతా… బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Nandini-Rai

బిగ్ బాస్ 2లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ షో ముగిసిన తరవాత వరుస ఆఫర్లను దక్కించుకుంది. నందిని రాయ్ తెలుగమ్మాయే అయినప్పటికీ హిందీ ఇండస్ట్రీ ద్వారా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో ముచ్చటించింది. ఏ రంగంలో అయినా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని సినిమా రంగంలో కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చింది. అయితే వెళ్లే వాళ్ళు మాత్రం వెళతారని అందరూ వెళ్లరని షాకింగ్ కామెంట్లు చేసింది. అంతే కాకుండా తాను రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసానని కోన్ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవసి వచ్చిందని చెప్పుకొచ్చింది. దానికి టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు కారణమని త్వరలోనే అతడి బాగోతం బయటపెడతా అంటూ కామెంట్లు చేసింది.

Related posts