నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చెక్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాను యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అందరి దృష్టి ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఈ ట్రైలర్‌లో నితిన్ ఓ ఖైదీగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. అయితే.. తాజాగా చెక్ మూవీ రిలీజ్ డేట్ మారింది. ఇంతకు ముందు ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఫిబ్రవరి 26న రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ మార్చడానికి అసలు కారణం ఏంటో క్లారిటీ రావడం లేదు కానీ… 26 అనే డేట్ దర్శకుడు, హీరో నితిన్‌కు బాగా కలిసి వచ్చిన నెంబర్స్ అని టాక్ నడుస్తోంది. అందుకే 26వ తేదీని ఫైనల్ చేసుకున్నారట.
previous post