telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నేడే ఎంపీపీ ఎన్నిక.. ఎంపీటీసీ కనిపించడం లేదు! 

local elections polling today as 3rd schedule

తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా గెలుపొందిన సభ్యులు నేడు మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తన భర్త కనిపించడంలేదని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం మూట్పూర్‌ గ్రామానికి చెందిన రాంరెడ్డి అదే గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. ఫలితాల వెల్లడి అనంతరం రాంరెడ్డి కనిపించడం లేదు. గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఆయన భార్య జ్యోతి మండల కార్యాలయానికి వచ్చారు. తన భర్త జాడ తెలపాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రిజల్ట్స్‌ తెలుసుకుందామని వచ్చిన తన భర్తను ఎవరో కిడ్నాప్‌ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో రాంరెడ్డిని ఎవరైనా క్యాంపునకు తీసుకెళ్లారా అనే విషయం తేలాల్సిఉంది.

Related posts