telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రవితేజ సినిమా నుండి మరో గిఫ్ట్..?

Raviteja

గత 2 సంవత్సరాలుగా హిట్ లేకుండా సతమతమవుతున్న మాస్ మహారాజ్ ఈ ఏడాదిని అద్భుత విజయంతో ప్రారంభించాడు మాస్ హీరో రవితేజ. ఊహించని విధంగా లాభాలను అందుకుని పరిశ్రమని బూస్టప్ చేసింది. పండగ హడావిడీ మొత్తం సినిమా థియేటర్ల దగ్గర కనిపించేలా చేసి ప్రేక్షకులు థియేటర్లను మర్చిపోలేదని గుర్తు చేసింది. అంతేకాకుండా తన కెరీర్‌లో సాలిడ్ కంబాక్ ఇచ్చాడు. క్రాక్‌ సినిమాతో కెరీర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో హ్యాట్రిక్ చేసింది. అయితే ప్రస్తుతం రవితేజ రవి వర్మ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా ఇప్పటికే పట్టాలేక్కెసి చాలా దూరం ప్రయాణించింది. దీనికి ఖిలాడి అనే పేరును ఖరారు చేశారు. దీనిపై కూడా అభిమానుల్లో మంచి అంచానాలే ఉన్నాయి. అయితే సంక్రాంతి పండగకి క్రాక్‌తో అందరిని అలరించిన రవితేజ, జనవరీ26న పుట్టిన రోజుకు మరో గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. తన పుట్టినరోజు సందర్భంగా ఖిలాడీ సినిమా నుంచి ఏదైనా గ్లింప్స్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తప్పకుండా గ్లింప్స్ వస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Related posts