telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

వైరల్ అవుతున్న బాలయ్య వీడియో…

హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ.. అక్కడ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఓ అభిమానిపై తన కోపాన్ని చూపించారు.. 9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.. అది చూపి కోసంతో ఊగిపోయిన బాలయ్య.. అతడిపై చేయిచేసుకున్నాడు.. ఆ వీడియో, ఫొటోలను డిలీట్ చేయాలంటూ తన సెక్యూరిటీని ఆదేశించారు.. అయితే, ఆ తర్వాత.. దెబ్బలు తిన్న బాలయ్య అభిమాని మరో వీడియో విడుదల చేశాడు… తాను బాలయ్యకు వీరాభిమానిని… విశ్రాంతి లేకుండా బాలయ్య బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు.. మా అన్న వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.. ఎవరో బయటి వ్యక్తి అని బాలయ్య నా పట్ల అలా ప్రవర్తించారు.. నేను ఇలాంటి ఘటనలను పట్టించుకోను.. అయితే, కొందరు ఆ ఘటనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. అలాగే బాలయ్య ఎలాగైనా నన్ను తాకినందుకు ధన్యుడిని అయ్యాను అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Related posts