telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…

lockdown corona

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే మన దేశంలో నమోదవుతున్నా నాలుగు లక్షల కేసులో దాదాపు సగం కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దాంతో ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో మహారాష్ట్రలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.  నైట్ కర్ఫ్యూతో పాటుగా ఉదయం సమయంలోనూ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది.  ఇక వీకెండ్స్ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కరోనా మహమ్మారి నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.  అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలను జూన్ 1 వ తేదీ ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Related posts