telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజధానిలో భూకంపం.. భయబ్రాంతులలో ప్రజలు..

earthquake in delhi fears public

అసలే కాలుష్య సమస్యతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించి ప్రజలను మరింత ఆందోళన కలిగించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయింత్రం స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా పలు నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధిలోని అనేక ప్రాంతాలలో ఇలాగె భూకంపాలు వచ్చినట్టు నమోదయ్యింది. భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగులు తీశారు. ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయ పర్వత ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుందని, దాని ప్రభావమే దేశ రాజధానిపై పడిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియరాావాల్సి ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అయిదు వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

సెప్టెంబర్ నెలలోను భూకంపం సంభవించింది. అప్పుడు లాహోర్ కు వాయువ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప తీవ్రత అప్పుడు 6.1గా రిక్టర్ స్కేల్ పై నమోదైయింది. కశ్మీర్ లో కూడా ఇలా స్వల్ప భూకంపం సంభవించింది. అయితే అప్పుడు కూడా భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఏది ఏమైనా దేశ రాజధానిలో భూకంపం ఒక్కసారిగా ప్రజలను భయాందోళనకు గురి చేసింది. నిన్న సాయంత్రం కూడా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కఛ్-భచావూ-అంజార్ ప్రాంతంలో భూకంప తీవ్రత నమోదైంది. కఛ్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 4.3 తీవ్రతతో భూమి కంపించింది.

Related posts