telugu navyamedia
సినిమా వార్తలు

వందకోట్ల దిశగా పరుగులు తీస్తున్న “భారత్”

Bharat

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన “భారత్” చిత్రం ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది”భారత్”. సెకండ్ డే కలెక్షన్స్ జోరు కాస్త తగ్గినప్పటికీ సెంచరీ ఈజీగా కొట్టేయగలడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 73 కోట్లకు చేరింది. సల్మాన్ కి ప్రతి ఏడాది ఈద్ సెంటిమెంట్ కలిసొచ్చినట్లుగానే ఈ ఏడాది రంజాన్ కూడా కలిసొచ్చింది. మొదటిరోజు “భారత్” సినిమా 42.30 కోట్లను కలెక్ట్ చేసింది. గురువారం 31 కోట్లను కలెక్ట్ చేసిన “భారత్” టోటల్ గా 73.31 కోట్లను అందుకుంది. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమంటున్నారు.

Related posts