telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళే వారి కొత్త జాబితా ?

ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 త్వరలో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హౌస్‌లోకి ఎవరు వెళ్లనున్నారన్నదని పై ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు కాని కొన్ని పేర్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. . ..ఇప్పుడు తాజాగా మరో జాబితా వైరల్ అవుతోంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఎప్పుడు ప్రారంభమయ్యేది ఖరారైంది. సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఆగస్టు 22 నుంచి క్వారంటైన్‌కు పంపించనున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Anchor Ravi on his road to recovery from COVID-19: The toughest part of the  isolation was to stay away from Viya | The Times of India

ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త జాబితాలోయాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్, రఘు పేర్లు ఉన్నాయి.

Bigg Boss Telugu 5: రేసులో TV9 యాంకర్ ప్రత్యూష.. మరో టాప్ జర్నలిస్టు.. ఇంకా  ఎవరెవరంటే! | Bigg Boss Telugu 5 may start in July: Anchor Pratyusha, TV5  Murthy, Anchor Ravi on top list - Telugu Filmibeat

ఇప్పటి వరకూ విన్పించిన యాంకర్ వర్షిణి, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యానీ మాస్టర్, నిఖిల్ పేర్లు ఈ కొత్త జాబితాలో లేవు. ఇప్పటికే బిగ్‌బాస్ కొత్త ప్రోమో విడుదలైంది. బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్ బై..వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అంటూ నాగార్జున మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు.

Tiktok videos with song aatasandeep - original sound

ఇక బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో బిగ్ బాస్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరి కొద్దిరోజుల్లోనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అస‌లు కంటెస్టెంట్స్ పేర్లను విడుదల చేశే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం చేసాయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

Bigg Boss-5 Lahari Shari Telugu Boss Tollywood Latest News Social Media - 5  Jambi Reddy Nagarjun Hosting Teja Sajja Tollywood-Telugu Trendi-TeluguStop

Related posts