telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొలిక్కి వచ్చిన.. భానుప్రియ కేసు.. తల్లీకూతుళ్ల అరెస్ట్..మీడియా గోడు..

BhanuPriya

ఇటీవల నటి భానుప్రియ ఇంటి పని అమ్మాయిపై వేధింపులు అంటూ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దానిపై స్పందించిన భానుప్రియ, అది దొంగతనం కేసుగా చెప్పారు.. చివరికి విచారణలో కూడా అదే తేలడంతో.. కేసు కొలిక్కి వచ్చేసింది. కేసు వివరాలలోకి వెళితే, భానుప్రియ ఇంట్లో తన కుమార్తె వేధింపులకు గురవుతోందని, ఆమె సోదరుడు లైంగికంగానూ వేధిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి కేసులో ఇది ఓ ట్విస్ట్. భానుప్రియ ఇంట బాలిక వేధింపులకు గురి కాలేదని, తల్లి ప్రోద్బలంతో దొంగతనానికి పాల్పడి, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చారని తేల్చిన పోలీసులు, వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ఆ బాలిక బీరువా తాళాలు ఎక్కడ పెడతారో గమనించి రూ. 1.50 లక్షల నగదు, నగలు దొంగిలించి తల్లికి ఇచ్చిందని, ఆపై భానుప్రియ కుటుంబీకులు నిలదీస్తే, నేరం అంగీకరించి నగలను వెనక్కు తెచ్చిందని పోలీసులు తెలిపారు. మిగతా డబ్బు అడుగుతారని భావించి, తప్పుడు కేసును పెట్టారని, వారిద్దరినీ మరింత లోతుగా విచారిస్తున్నామని అన్నారు. మొత్తానికి ఈ వార్తలతో భానుప్రియ అనే నటిని కొన్నాళ్ళు మీడియా ప్రముఖులు వేధించేశారు.. చక్కగా గతంలో నటిగా ఉన్న ఆమె తన మానాన తాను జీవిస్తుంటే, చిన్న విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి, ఆమెకు ఉన్న కొద్దిపాటి మనశాంతిని నాశనం చేశారు.. అంటూ మీడియాపై ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related posts