telugu navyamedia
క్రీడలు వార్తలు

పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది : టిమ్‌ పైన్‌

ఆసీస్‌ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ ఆటగాళ్లకు మింగుడుపడడం లేదు. దాంతో తాజాగా ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ… ‘‘పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్‌లో అలాంటి వాటికి మేం వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ కూడా చెబుతా. టీమిండియా ఆటగాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్‌ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం’ అని పైన్‌ అన్నాడు. కరోనా అధికకంగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ గబ్బాలో కాకూండా వేరే వేదికపై నిర్వహించాలని సూచించింది.

Related posts