telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్‌

Supreme Court

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. పిటిషన్‌పై రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది.

హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అభ్యంతరాలను పిటిషన్‌లో ప్రభుత్వం లేవనెత్తినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న హక్కల మేరకే కమిషనర్‌గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. కమిషనర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, కనగరాజు నియాయకం చెల్లుతుందని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది.

Related posts