telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్ .. పలువురి ప్రశంసలు..

gambir praised kohli on winning series

భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని గౌతం గంభీర్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. ఓడిపోతామనే భయం లేకుండా బరిలోకి దిగడమే కోహ్లీ ప్రధాన బలమని పేర్కొన్నాడు. ఓటమి గురించి మీరు భయపడితే ఎప్పటికీ విజయం సాధించలేరు. ఓటమిని లెక్కచేయకుండా కోహ్లీ బరిలోకి దిగుతాడు. అదే అతడి బలం. సారథులుగా గంగూలీ, ధోనీ, ద్రవిడ్‌ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృషించాడు. స్వదేశంలో పాటు విదేశాల్లోనూ విజయ పరంపర కొనసాగిస్తున్నాడు. ఏ కెప్టెన్‌ సాహసం చేయలేని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడు. ఇతర కెప్టెన్లంతా అదనపు బ్యాట్స్‌మన్ జట్టులో ఉండాలని కోరుకుంటారు. దీని వల్ల టెస్టును కోల్పోకుండా ఉంటామని వారి ఆలోచన. కానీ, కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడు. విదేశాల్లోనూ అదే ప్రణాళికను అనుసరిస్తాడు. ఇలాంటి సాహాసాలు చేయగలిగేది కోహ్లీ మాత్రమేనని తెలిపాడు.

పుణె లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో సొంతగడ్డపై వరుసగా 11 టెస్టు సిరీసులు గెలిచిన ఏకైక జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. ఈ నెల 19న రాంచీ వేదికగా ఆఖరి టెస్టు జరగనుంది.

Related posts