telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నేడు సీఎం జగన్ పెళ్లిరోజు.. నాటి పెళ్లి ఫొటో పోస్టు చేసిన రోజా

cm jagan marriage photo

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు వెల్లువిరుస్తున్నాయి. బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కోడా జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘జగన్ అన్న, వదినమ్మ… హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ’ అంటూ రోజా ట్వీట్ చేశారు. వారిద్దరూ ఆదర్శప్రాయమైన జంటగా కొనసాగాలని అభిలషించారు. ఈ దినం ఎంతో ఆనందభరితంగా సాగాలని ఆకాంక్షించారు. , జగన్-భారతిల పెళ్లి నాటి ఫొటోను కూడా రోజా పోస్టు చేశారు.

Related posts