ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటారు సైనికులు. దేశ సరిహద్దుల్లోని కాదు, దేశంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తామున్నామని ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి సహాయం అందిస్తుంటారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తించడం అంటే సాహాయంతో కూడుకున్నదే. ఎటు నుంచి ముష్కరులు దాడులు చేస్తారో తెలియదు. కుప్వారా జిల్లాలో నిత్యం కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మంచు దట్టంగా కురుస్తోంది. పెద్ద ఎత్తున మంచు రోడ్లపై పేరుకుపోయింది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్ళాలి అంటే అక్కడ నరకం కనిపిస్తుంది. ఇక మారుమూల పల్లెల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటె కుప్వారాకు సమీపంలోని కరాల్ పురా నుంచి ఆర్మీకి ఫోన్ వచ్చింది. తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న సైనికులు వెంటనే రంగంలోకి దిగి, మోకాళ్ళ లోతులో ఉన్న మంచును సైతం లెక్క చేయకుండా గర్భిణిని, ఆమె కుటుంబ సభ్యులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మంచు కురిసే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో సైనికులు అక్కడి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికీ ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా చేస్తూనే ఉన్నారు.
previous post