telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉగాది పచ్చడి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా !

ఉగాది అచ్చమైన తెలుగు వారి పండుగ. ఉగాది అనే సంస్కృతం నుంచి వచ్చింది. చైత్ర శుక్ల పాండ్యమినాడు ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. ఉగాది పచ్చడి.. ఉగాది పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం. తీపి, కారం, ఉప్పు, వగరు, పులుపు, చేదు అనే ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట. అయితే.. ఇపుడు అవేంటో తెలుసుకుందాం

బెల్లం లివర్ లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది
మామిడి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
వేప పువ్వు రక్తాన్ని శుద్ది చేసి.. చర్మ వ్యాధులను నిర్వదిస్తుంది.
కారం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
డీ-హైడ్రేషన్, రుమటాయిడ్, అర్థరైటీస్ ల నుంచి ఉప్పు కాపాడుతుంది.
శరీరం మినరల్స్ ను సులభంగా గ్రహించేలా చింతపండు ఉపయోగపడుతుంది. అజీర్తి, కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది

Related posts