telugu navyamedia
రాజకీయ వార్తలు

“మహా” సర్కార్ కీలక నిర్ణయం..రేపటి నుంచి సడలింపులు!

uddhav-thackeray-shivasena

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్‌డౌన్‌ సడలింపులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో మేము పలు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పరిమితంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు.

అదృష్టవశాత్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉద్ధవ్ థాకరే అన్నారు.మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉంది. క్రమంగా మహారాష్ట్రల్లో అన్ని పనులను ప్రారంభిస్తామన్నారు. అన్ని పనులూ సరిగ్గా జరిగితే అందరూ కార్యాలయాలకు వెళ్లి పనులు చేసుకోవచ్చుని తెలిపారు.

రాష్ట్రంలోని వలస కూలీలు బాధపడొద్దని తెలిపారు. కరోనా సంక్షోభం ముగిసిపోగానే కూలీలు తమ ఇంటికి వెళ్లడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,651కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 211 మంది మృతి చెందగా, 365 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఈ రోజు కూడా పదుల సంఖ్యలో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం సడలింపులకు అవకాశమిచ్చింది.

Related posts