సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. బిజెపి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు అనేక మంది కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపణలు చేశారు. కళ్ళ ఎదుటే బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని ఆగ్రహించారు. కొన్ని చోట్ల స్వయంగా పోలీసులే విచక్షణారహితంగా బిజెపి కార్యకర్తల పై లాఠీలు ఝళిపించారని ఆరోపించారు. బాధితులు వెళ్లి పోలీసులకు పిర్యాదు చేస్తే తిరిగి బాధితుల పైనే కేసులు బనాయించారని… ఈ దాడులు సీఎం, డిజిపి డైరెక్షన్ లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతుందని మండిపడ్డారు. ఎన్ని దాడులు జరిగినా, కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినా బిజెపి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకారం అందించారని తెలిపారు. బిజెపి కార్యకర్తల మీద జరిగిన దాడులకు రాష్ట్ర డిజిపి బాధ్యత వహించాలన్నారు. ఈ దాడులను ఎదుర్కొని ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించడానికి బిజెపి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
previous post