telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అఖిల ప్రియ కేసు : వెలుగులోకి కీలక విషయాలు

again missed akhila priya husband

అఖిల ప్రియ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్లో కొనసాగుతోంది అఖిల ప్రియ కస్టడీ విచారణ. ఉదయం నుంచి కొనసాగుతున్న విచారణ… కిడ్నాప్‌ లో కీలకంగా వ్యవహరించిన గుంటూర్ శ్రీను, చంద్రహాస్, భార్గవ్ రావ్ ల ఆచూకీ పై విచారణ కొనసాగుతున్నది. బాలీవుడ్ మూవీ స్పెషల్ 26 ని అనుకరించి కిడ్నాప్ ప్లాన్ వేసినట్టు గుర్తించారు దర్యాప్తు అధికారులు.
యూసఫ్ గూడ ఎంజీఎం స్కూల్ లో కిడ్నాప్ కు స్కెచ్ వేయగా… వాహనాల నెంబర్ ప్లేట్ లను స్కూల్లో మార్చినట్టు గుర్తించారు పోలీసులు. స్కూల్ ప్రాంగణం నుంచి cc కెమెరా వీడియోలు, కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..ఏసీపీ, ci ,మహిళ సిబ్బంది సమక్షం లో దర్యాప్తు కొనసాగుతోంది. మరి కొంత మంది కోసం టీం లుగా కొనసాగుతున్న గాలింపు… ఇప్పటికే సిద్దార్థ్, దుర్గ పోలీసుల అదుపులో ఉన్నారు.

Related posts