telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

18 నుండే .. రెండోదశ ఎన్నికలు..

After 11 Parishat Elections Telangana

కొన్ని ఒడుదుడుకుల మధ్య మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అందరి దృష్టి ఇప్పుడు ఈ నెల 18న జరగబోయే రెండో దశ ఎన్నికలపైనే ఉంది. 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది.

పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలో 14 చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపిలో 8, అసోం, బీహార్‌, ఒడిశాలలో 5 చోట్ల, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్మూకాశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్‌, త్రిపురలో ఒక్కోచోట రెండోదశలో పోలింగ్‌ జరుగుతుంది. యూపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుంటే ,8 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరుగుతుంది. ఈ 8 స్థానాలు బిజెపి సిట్టింగ్‌ స్థానాలే కావటం విశేషం.

మొదటి దశ అనుభవాలతో, రెండో దశకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. 

Related posts