telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హరీష్ శంకర్ పోడ్‌కాస్ట్… “సౌండ్స్ గుడ్” విన్నారా ?

Harish-Shankar

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొత్త విషయాలను ‘సౌండ్స్ గుడ్’ పేరుతో పోడ్‌కాస్ట్ రూపంలో విడుదల చేస్తున్నారు. ట్విటర్ ద్వారా హరీష్ ఈ విషయాన్ని ప్రకటించారు. “గతంలో చాలా మంది రేడియో నాటకాలు వినేవారు. అవి వాయిస్ ద్వారానే ఎన్నో ఎమోషన్స్ పండించేవి. అవి వింటూ పనులు చేసుకునేవారు. నేను ఇప్పుడు అన్ని ఎమోషన్స్ పండించకపోవచ్చు. కానీ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయి ఎన్నో కొత్త విషయాలను మీకు చెబుతా. అలాగే మా గ్యాంగ్ అందరితో మాట్లాడుతూ ఆ విశేషాలను మీతో షేర్ చేసుకుంటాను” అని హరీష్ ట్వీట్ చేశారు.

Related posts