telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్యన్ ఖాన్‌‌కు నో బెయిల్‌..

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైయ్యింది. బెయిల్ కోసం అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది ముంబయి ప్రత్యేక న్యాయస్థానం. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ తాజాగా తీర్పును వెల్లడించింది.

అక్టోబర్ 14న ఆర్యన్‌, అర్బాజ్, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్​సీబీ, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్​సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్‌ ఈ నెల 20కు వాయిదా వేశారు. తాజాగా బుధవారం ఈ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పును వెలువరించింది.

Aryan Khan Bail Plea: Mumbai court denies bail to Aryan Khan and two others  in drugs case, to remain lodged in Arthur Road jail - The Economic Times

కొద్దిరోజులగా ఆర్యన్ ఖాన్​ తరచూ డ్రగ్స్ సేవిస్తున్నాడని కోర్టుకు తెలిపింది ఎన్​సీబీ. కొందరు ఏజెంట్లతోనూ ఇతడికి పరిచయాలున్నట్లు పిటిషన్​లో పేర్కొంది.ప్రస్తుతం ఆర్యన్, అర్బాజ్ ముంబయిలోని ఆర్థర్​ రోడ్​ జైల్లో ఉండగా, ధమేచా.. బైకుల్లా మహిళల జైలులో ఉంది. అరెస్టైన‌ప్ప‌డు నుంచి జైల్లో ఆర్యన్ రోజు ఏడుస్తూనే ఉంటున్నాడని, సరిగ్గా తిండి కూడా తినడం లేదని తెలుస్తుంది.

దీంతో షారుక్‌, అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు జైలో న‌ర‌క‌యాత‌న ప‌డ‌డ‌డం తల్లి గౌరీ ఖాన్ సరిగా నిద్రపోవడం కూడా పోవ‌డం లేదని స‌న్నిహితులు చెపుతున్నారు.

Related posts