విపక్షాలు వివిపాట్ ల స్లిప్ లను 50 శాతం లెక్కించాలని కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఐదు వివిపాట్ లను లెక్కించాలని స్పష్టంగా చెప్పింది. దీనితో సంతృప్తి చెందని విపక్షాలు మరో పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ జరిగింది.
నేడు ధర్మాసనం 50 వివిపాట్ ల స్లిప్ లను లెక్కించడం సాధ్యం కాదని ఈసీ తేల్చడంతో .. వారిని ఏకీభవించి తదనుగుణంగా తీర్పు వెలువరించారు. దీనితో విపక్షాలకు నిరాశ ఎదురైంది. అయితే న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని దీనిపై విపక్షాలు స్పందించాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. లెక్కింపు 23వ తేదీ కావటంతో, మరోసారి విపక్షాలు పోరాటానికి సిద్ధం అవనున్నట్టు తెలుస్తుంది.
మీడియాలో ఓ వర్గం చంద్రబాబుకు పల్లకీ సేవ: విజయసాయిరెడ్డి