జంట నగరాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఆషాడ బోనాల నిర్వహణ గురించి మాట్లాడుతూ, ఒక్క జంట నగరాల పరిధిలో ఆషాఢ మాసంలో సుమారు 2500 ఆలయాలలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోనాల జాతర ఉత్సవాలు మహా నగర పరిధిలో వచ్చే నెల 4న ప్రారంభమవుతాయన్నారు.
నగరంలో ప్రప్రథమంగా గోల్కొండ కోట పరిధిలోని జగదాంబ మహంకాళికి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారన్నారు. జగదాంబ అమ్మవారు ఉత్సవాలు లంగర్ హౌజ్‌లోని చౌరస్తాలో వచ్చే నెల 4న మధ్యాహ్నం పలువురు మంత్రులు, అధికారులు, అనధికారుల రాకతో ప్రారంభమవుతాయన్నారు. ఇదే తరహాలో నగరంలోని బోనాల ఉత్సవాలన్నీ ఆగస్టు 1వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 2500 ఆలయాలకు ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేసిందన్నారు.
గతంలోనూ ఇదే మొత్తాన్ని కేటాయించగా, రూ.11.3 కోట్లను బోనాల ఉత్సవాలకు వ్యయం చేశామన్నారు. బోనాల నిర్వహణ, తదితర కార్యక్రమాలకు సంబంధించి జూలై 1న బోనాల ఉత్సవాల కమిటీ సమావేశం సోమవారం సెక్రటేరియట్‌లో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారన్నారు.
ఫెడరల్ ప్రంట్ పేరుతో కేసీఆర్ తీర్థయాత్రలు: పొన్నం