telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్యని చూస్తుంటే చాలా బాధగా వుంది. : సాయేషా సైగల్

aarya

తన భర్త రోజూ జిమ్‌లో కష్టపడుతుంటే చూడలేకపోతున్నానని అంటోంది ఆర్య సతీమణి సాయేషా సైగల్. ఇటీవల తన కొత్త సినిమా కోసం కండలు పెంచానంటూ షాకింగ్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్య జిమ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ. ‘నా భర్తను ఇలా చూసి బాధతో తట్టుకోలేకపోతున్నా. ఆయన్ని చూసి గర్విస్తున్నాను’ అని కామెంట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘సాల్పె్ట్టా’ అనే సినిమాలో ఆర్య నటిస్తున్నారు. ఇందులో ఆయన బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. అందుకే వీలనైంతగా కండలు పెంచే పనిలో ఉన్నారు ఆర్య. దీంతో పాటు ఆర్య ‘టెడ్డీ’ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. శక్తి సౌందరరాజన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్య, సాయేషా మరోసారి జంటగా నటించారు. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతోంది. సాయేషా తెలుగులో ‘అఖిల్’ అనే సినిమాతో పరిచయం అయింది. అక్కినేని వారసుడు అఖిల్‌కు కూడా ఇది తొలి సినిమానే. కానీ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సాయేషా తమిళంకు వెళ్లిపోయింది. ఆర్యతో కలిసి చాలా సినిమాల్లో నటించింది. గతేడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Related posts