telugu navyamedia
రాజకీయ వార్తలు

బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు..మోగిన సెక్యూర్టీ సైర‌న్

baricade parliament

పార్ల‌మెంట్‌లో ఈ రోజు గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన‌క‌ర్ కారు  ఒక్కసారిగా బూమ్ బారియ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో సెక్యూర్టీ సైర‌న్ మోగింది. వెంటనే అక్క‌డ ఉన్న సెక్యూర్టీ అంతా అల‌ర్ట్ అయ్యారు. బూమ్ బ్యారికేడ్‌ను కారు అనుకోకుండా తాక‌డం వ‌ల్ల‌.. దాని నుంచి స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో కారు అక్క‌డే నిలిచిపోయింది.

అయితే స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో.. సెక్యూర్టీ సైర‌న్ మోగింది. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉండే భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. వెంట‌నే వాళ్లంతా పొజిష‌న్ తీసుకున్నారు. 2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత‌.. గేట్ల వ‌ద్ద స్పైక్స్‌ల‌ను అమ‌ర్చారు. అయితే ఇదే త‌ర‌హా ప్ర‌మాదం గ‌త ఏడాది కూడా జ‌రిగింది.

Related posts