బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గ్రేటర్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ వేసిందని.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని హెచ్చిరించారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని.. EC, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకుందన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది అని.. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ పార్టీ కి ఇది చెంపపెట్టు అన్నారు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని…లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని.. లేకపోతే ప్రజలే ఈ కెసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని హెచ్చిరించారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని…. టిఆర్ఎస్, ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందని మండిపడ్డారు. ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన ఈ.సి… సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదని ప్రశ్నించారు. 5 నుండి 6 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగింది ? …దీనిపై హైకోర్టు విచారణ జరపాలన్నారు. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ, ఎక్కడా ఎన్నికలు జరగలేదని…. పెన్నుతో టిక్కులు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చేయడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న ఆకలి, ఆపతి, ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని TRS ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలు అని తెలిపారు.
previous post
next post