telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు…

minor raped child in visakha

నాలుగేళ్ల బాలికను చాక్లెట్ కోసమని కిరాణా దుకాణానికి తీసుకువెళ్లి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాక భాస్కర్ నగర్ లోని నిన్న మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం  భాస్కర్ నగర్ కాలనీలో ఎస్టీ కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి చాకెట్లు తెచ్చుకోవడానికి ఇంటి సమీపంలో ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణం వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న పింగళి గణేష్ ఆలీయాస్ చింటూ చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి దుకాణం వద్దకు వెళ్లి ఆ వ్యక్తిని చితకబాది స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సంఘటన మీద ఎస్సై బమ్మెర బాలకృష్ణ మాట్లాడుతూ పోక్సో కేసుతో పాటు 366, 376 క్లాజ్ 2 506 ఐపీసీ కింద 5 క్లాస్ ఎం రెడ్ విత్ 6 ఆఫ్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts