telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కడపలో .. ప్రభుత్వ ఉక్కు కర్మాగారం .. హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌..

ap logo

ఏపీ ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ పేరిట కొత్త సంస్థకు శ్రీకరం చుట్టింది. ఈ మేరకు రెండు ఉత్తర్వులు విడుదల చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు కంపెనీ అని స్పష్టం చేస్తూ రూ.10 లక్షల మూల ధనం కేటాయించారు. ఇన్‌క్యాప్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యదర్శి కె రాంగోపాల్‌ను కంపెనీ డైరెక్టర్లుగా నియమించింది.

రాష్ట్ర పునర్నిర్మాణ చట్టంలో పేర్కొన్న కడప స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై ఇంతకుముందే కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన టాస్కుఫోర్స్‌ నియమించారని, 18.95 శాతం (పన్ను విధింపునకు ముందు) మిగులు ఉంటుందని మెకాన్‌ సంస్థ ప్లాంటు ఫీజిబిలిటీ నివేదిక సమర్పించినట్టు జిఒలో పేర్కొన్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి-పెద్దనందలూరు మధ్య స్టీల్‌ ప్లాంటును ప్రైవేటు పెట్టుబడిదారు ఏర్పాటు చేస్తారంది. అవసరం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్త్తుందని కూడా పేర్కొనడం గమనార్హం.

Related posts