telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యకు విలన్ గా సంజూ భాయ్ ?

Sanjay-Dutt

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది. బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లు పెట్టార‌ట‌. ఇప్ప‌టికే కేజీఎఫ్ 2 చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్న సంజ‌య్ ద‌త్‌.. బాల‌య్య ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మూవీకి మంచి హైప్ వ‌చ్చిన‌ట్టే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న బాల‌య్య- బోయ‌పాటి చిత్రాన్ని రెండు నెల‌లో పూర్తి చేసేలా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts