telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఇద్దరు హీరోయిన్లకు అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు…?

Sanjana

కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రాగా… ఆగస్ట్ లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో టీవీ నటి అనిక కూడా ఉంది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ కి చెందిన 6 గురుని అరెస్ట్ చేసిన బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు వారితో పాటుగా కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీ లను కూడా అరెస్ట్ చేశారు. రాగిణి, సంజనా డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారం బయటపడిన వెంటనే రాగిణి, సంజన తమ మొబైల్స్‌లోని డేటాను మొత్తం డిలీట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సంజన, రాగిణి లను విచారిస్తున్న సమయం దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ కు అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు ఉన్నాయని, సంజన కంటే రాగిణికి ఎక్కు సంబంధాలు ఉన్నాయని తెలిసిందట. మరో వైపు విచారణ సమయంలో నటి సంజన పలుమార్లు ఆవేదనతో కనీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు వారిద్దరిని మరికొన్ని రోజులు విచారణ జరపాలని భావిస్తున్నట్టు సమాచారం.

Related posts