telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

chiru

తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే రకరకాల పూలు సేకరించిన మహిళలు.. ఇప్పుడు బతుకమ్మలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఆడ పడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసింది ఎమ్మెల్సి కవిత. ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా, వరద సమస్యలు తెలంగాణను విడిచిపెట్టాలని ఆమె కోరారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడ పడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు చిరు. “బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.” అంటూ చిరు ట్వీట్ చేశారు.

Related posts