telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన ఎంపీ బండి సంజయ్ కుమార్

Bandi sanjay bjp

తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పూలు సేకరించిన మహిళలు.. ఇప్పుడు బతుకమ్మలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకొని ప్రతి గ్రామంలో నగరంలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ పరంపరగా కొనసాగడం ప్రజల సంఘటిత శక్తిని నిరూపిస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ విజయదశమి పండగల సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తాము చేపడుతున్న కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రజా జీవితంలోని అన్ని రంగాల్లో వ్యక్తిగత సామాజిక కష్టాలను తెచ్చిపెట్టిందని..విజయదశమి సందర్భంగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన కష్టాలనుండి అధిగమించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పార్కోన్నారు.

Related posts