telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శ్యామ్ సింగ రాయ్” రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్‌…

అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు నాచురల్ స్టార్. తరువాత అలా మొదలైందితో సినీ రంగంలో హీరోగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. అయితే ఈ ఏడాది మాత్రం నాని ఓకేఒక్క సినిమాను విడుదల చేశాడు. అదే నానీ, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ తెరకెక్కిన సినిమా వీ. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేశారు. అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. అయినా నాని తన స్పీడు తగ్గించలేదు. వరుస సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. అయితే నానీ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి, క్రితి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం చేయనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ఇవాళ మొదలైంది. ఈ సందర్భంగా నాని తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్‌ చేశాడు. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీతెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.

Related posts