బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివరిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా హిట్, ఫ్లాప్ అనేది సంబంధం లేకుండా షారూఖ్‌ని అభిమానిస్తుంటారు. అయితే షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కబీ ఖుష్ కబీ గమ్’, ‘కబీ అల్వీదా నా కహెనా’, ‘మైనేమ్ ఈజ్ ఖాన్’…వంటి సినిమాలతో వరుసగా హిట్స్ కొడుతూ.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో షారుఖ్ నటించారు. కరణ్ జోహార్ తన మిత్రుడు షారుఖ్‌కు ఓ అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పాపులర్ బ్రాండ్‌కు చెందిన జాకెట్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని షారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు కరణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. కరణ్ ఫ్యాషన్ సెన్స్‌ను అందుకోవడం కష్టం అని తెలిపారు. కాగా ఈ జాకెట్ ఖరీదు దాదాపుగా రూపాయలు ఒక లక్షా పాతిక వేలకు పైగా ఉండనుందని తెలుస్తోంది.
రాంగోపాల్ వర్మ మనుషులు పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పారు… అందుకే కేసు వెనక్కు…!!