ప్రముఖ కొరియోగ్రాఫర్స్ లారెన్స్, ప్రభుదేవాల తరహాలో బ్రందా మాస్టర్ కూడా మెగాఫోన్ చేతబట్టారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో, జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాతో బ్రందా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఫస్ట్ షాట్‌కి సీనియర్ నటి ఖుష్బు క్లాప్ నివ్వగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు, దర్శకులు భాగ్యరాజా, సుహాసిని మణిరత్నం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై యూనిట్‌ను అభినందించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే కన్మణి’(ఓకే బంగారం) సినిమాలోని ‘హేయ్ సినామిక’ అనే పాటనే ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టడం విశేషం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని తమిళ్‌తో పాటు, తెలుగులోనూ విడుదల చేయనున్నారు.
next post