telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోటిన్నర ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి

Sai-Pallavi

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ ఫిదా చేసేసింది సాయి పల్లవి. ఆ తర్వాత ‘ఎంసీఏ’ ‘పడి పడి లేచే మనసు’ ‘కణం’ ,’మారి 2′, ‘ఎన్ జీ కె’ చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవికి ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందట. దీని కోసం ఈ బ్యూటీకి దాదాపు కోటిన్నర ఆఫర్ చేశారట చిత్ర యూనిట్. అయితే సాయి పల్లవి ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేసినప్పటికీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’.. రానా ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి కమెర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తోంది.

Related posts